CBN Letter To DGP: తెలుగుదేశం నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులు పెడుతున్నారని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసుల్లో సాధారణంగా ఫిర్యాదుదారులు పోలీసులు లేదా స్థానిక రెవెన్యూ అధికారులు ఉంటున్నారని... ఫిర్యాదుదారు సిద్ధంగా ఉండి, నిందితుల జాబితాలో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ‘ఇతరులను’ చేర్చుతున్నారని తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా సెక్షన్ 307 లేదా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక సెక్షన్లు పెడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలోని మాచర్ల, కుప్పం, తంబళ్లపల్లె, తదితర ప్రాంతాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్ నం. 2/2023లో పేర్కొన్న రెవెన్యూ అధికారి ఫిర్యాదులో టీడీపీ నేతలపై మాత్రమే కఠినమైన సెక్షన్లు పెట్టారని.., వైసీపీ నేతలపై సాధారణ సెక్షన్లతో నామమాత్రపు కేసు పెట్టారని ధ్వజమెత్తారు. పోలీసులు చట్ట ప్రకారం విధులు నిర్వర్తించకుంటే, రాబోయే కాలంలో అలాంటి పోలీసులను చట్ట ప్రకారం శిక్షిస్తారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ఇవీ చదవండి: