Chandrababu: ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగు వారికి ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆ మహనీయుడి ఆశయాన్ని సీఎం జగన్ రెడ్డి తుంగలో తొక్కుతూ.. రాష్ట్ర అభివృద్ధిని, పురోగతిని ప్రశ్నార్ధకం చేశారని మండిపడ్డారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాన్ని వివరిస్తూ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించి, నివాళులర్పించాలని చంద్రబాబు కోరారు.
ఆంధ్రరాష్ట్ర అవతరణకు ఆత్మార్పణ చేసిన వ్యక్యి అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనియాడారు. తెలుగువారి ఉనికిని, ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు ఆత్మబలిదానం చేసిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములని అన్నారు.
-
ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుస్తూ సత్యం, అహింసా ధర్మాలను ఆచరించిన మహనీయుడి పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.(1/2) pic.twitter.com/ymF7Si3a33
— Lokesh Nara (@naralokesh) December 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుస్తూ సత్యం, అహింసా ధర్మాలను ఆచరించిన మహనీయుడి పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.(1/2) pic.twitter.com/ymF7Si3a33
— Lokesh Nara (@naralokesh) December 15, 2022ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుస్తూ సత్యం, అహింసా ధర్మాలను ఆచరించిన మహనీయుడి పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.(1/2) pic.twitter.com/ymF7Si3a33
— Lokesh Nara (@naralokesh) December 15, 2022
ఇవీ చదవండి: