YS Sharmila Health Bulletin: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గత రెండు రోజులుగా షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా.. రాత్రి ఒంటిగంట తర్వాత పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. షర్మిల అరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు కొద్దిసేపటిక్రితం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. లోబీపీ , బలహీనతతో ఉన్నారని వైద్యులు తెలిపారు. డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందన్నారు.
వైఎస్ షర్మిలకు తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్, ప్రీ-రీనల్ అజోటెమియా కూడా ఉన్నట్లు వివరించారు. ఈరోజు లేదా రేపు ఉదయం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆమెకు 2 నుంచి 3 వారాల వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వైద్యులు తెలిపారు.
అసలెేం జరిగిదంటే: ప్రజాప్రస్థాన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల ఆమరణ నిరాహర దీక్ష చేపట్టారు. మొదట లోటస్‌పాండ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి.. ఆందోళన చేస్తుండటంతో కొద్దిసేపటి వరకు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన దీక్ష విరమించాలని పోలీసులు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనడంతో బలవంతంగా రోడ్డుపై నుంచి ఇంట్లోకి పంపించారు. ఈ నేపథ్యంలో షర్మిల.. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి, నిరసన వ్యక్తం తెలిపారు.
ఈ సందర్భంగా సైఫాబాద్ పోలీసులు ఆమెను అరెస్టు చేసిన తన నివాసం లోటస్‌పాండ్‌కు తరలించారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె రోడ్డుపై ఆమరణ దీక్షకు ఉపక్రమించారు. దీంతో పోలీసులు బలవంతంగా రోడ్డుపై నుంచి ఇంట్లోకి పంపడంతో తన నివాస ప్రాంగణంలో షర్మిల ఆమరణ దీక్ష కొసాగించారు.
ఇవీ చదవండి: