RTA COMMISSIONER ORDERS FOR PRIVATE TRAVELS: సంక్రాంతి సందర్భంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ కమిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయులు అన్ని జిల్లాల డీటీసీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు రవాణా శాఖ సంయుక్త కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులు స్టేజీ క్యారేజీగా తిప్పడం నేరమని, ఆన్ లైన్లో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. కేసు తీవ్రతను బట్టి కేసులు నమోదు చేసి ట్రావెల్స్‌పై ప్రాసిక్యూషన్ చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు ఎక్కువ మంది రాకపోకలు చేయనున్న దృష్ట్యా సరిహద్దుల్లోని చెక్‌పోస్టు వద్ద తనిఖీల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిట్నెస్ లేకుండా సరైన ధ్రువపత్రాలు లేకుండా, కండిషన్ లేని బస్సులు నడిపితే సీజ్ చేస్తామని తెలిపారు. ఇంటర్నెట్లో ప్రైవేట్ ట్రావెల్స్ వసూలు చేసే ఛార్జీల వివరాలూ, ఆధారాలు తీసుకుని కేసులు రాస్తామని చెప్పారు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు రవాణా శాఖకు ఫిర్యాదు చేసేందుకు రవాణాశాఖ వెబ్సైట్లో అధికారుల ఫోన్ నెంబర్లను పొందుపరిచామని.. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులు సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: