ETV Bharat / state

AP High Court Sensational Judgment: లైంగిక వేధింపుల కేసు..హైకోర్టు సంచలన తీర్పు - Andhra Pradesh high court judgments News

AP High Court Sensational Judgment: లైంగిక వేధింపుల దుష్ప్రవర్తనకు పాల్పడిన ఓ ప్రభుత్వ ఉద్యోగి విషయంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) సంచలన తీర్పును వెలువరించింది. అభియోగం నిరూపణ అయినందున ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించడాన్ని హైకోర్టు సమర్థిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

AP_ High_ Court_ Sensational_ Judgment
AP_ High_ Court_ Sensational_ Judgment
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 11:02 PM IST

AP High Court Sensational Judgment: పోలీసు శాఖకు చెందిన ఓ జూనియర్‌ అసిస్టెంట్‌.. తనతో కలిసి విధులు నిర్వహించే ప్రదేశంలో ఓ మహిళ ఉద్యోగి ఆత్మగౌరవానికి భంగం కలిగేలా లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) సంచలన తీర్పు వెలువరించింది. ఇలాంటి వ్యవహారాల్లో కరుణ చూపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. హుందాతనంగా పనిచేసే హక్కు ‘మానవ హక్కు’ అని పేర్కొంది. సురక్షితమైన ప్రదేశంలో ఏ ఉద్యోగం, వృత్తి, వర్తకాన్ని చేపట్టేందుకు మహిళకు ప్రాథమిక హక్కుందని వెల్లడించింది. జీవించే హక్కు అంటే అర్ధం హుందాతనంగా జీవించడమేనని స్పష్టం చేసింది.

High Court Hearing on Sexual Harassment Case.. కర్నూలు ఏపీఎస్‌పీ రెండో బెటాలియన్‌లో సి.గోవిందరాజులు 1994 ఆగస్టు 17న జూనియర్‌ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. 2013 మే 10న ఓ మహిళ జూనియర్‌ అసిస్టెంట్‌తో లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన్ని విచారించిన ఉన్నతాధికారులు..సర్వీసు నుంచి తొలగిస్తూ 2013 డిసెంబర్‌ 26న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో గోవిందరాజులు వాటిపై ఏపీఎస్‌పీలో అప్పీల్‌ చేయగా.. డీఐజీ తిరస్కరిస్తూ 2014 ఆగస్టు 25న ఉత్తర్వులిచ్చారు. తనను సర్వీసు నుంచి తొలగించడం, అప్పీల్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ.. గోవిందరాజులు ఏపీఏటీని ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను కొట్టేస్తూ.. 2017 సెప్టెంబర్‌ 15 ఏపీఏటీ తీర్పు ఇచ్చింది. దాంతో ఆ తీర్పును సవాలు చేస్తూ.. గోవిందరాజులు అదే ఏడాది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

'కౌంటర్ దాఖలు వేయకుండా.. కోర్టుతో దాగుడుమూతలు ఆడుతున్నారా?'

High Court Found the Allegations Proved.. ఈ నేపథ్యంలో గోవిందరాజులు వేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల నుంచి మహిళ ఉద్యోగులను రక్షించేందుకు తీసుకొచ్చిన చట్టం (2013 డిసెంబర్‌ 9) గురించి గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ఓ కేసులో 'విశాఖ మారదర్శకాలు’ రూపొందించిందని తెలిపింది. గోవిందరాజులపై ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంది. సుప్రీం మారదర్శకాలను ఉల్లంఘిస్తూ.. దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. లింగ అసమానత్వం, లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు రుజువు అయ్యాయని తెలిపింది.

High Court Fire on Govindaraju.. అనంతరం సహచర మహిళ ఉద్యోగిని ఆత్మగౌరవానికి భంగం కలిగేలా లైంగిక వేధింపుల దుష్ప్రవర్తనకు పాల్పడిన పోలీసుశాఖకు చెందిన ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ను సర్వీసు నుంచి తొలగించడాన్ని హైకోర్ట్ సమర్థించింది. ఉద్యోగం నుంచి తొలగిస్తూ.. అధికారులు తీవ్ర శిక్ష విధించారన్న పిటిషనర్‌ వాదనను తోసిపుచ్చింది. ఆయనపై వచ్చిన అభియోగం నిరూపణ అయిన నేపథ్యంలో సర్వీసు నుంచి బర్తరఫ్‌ (డిస్‌మిస్‌) చేయాలని క్రమశిక్షణ అథార్టీ భావించిందని, చివరికి ఔదార్యం చూపుతూ.. సర్వీసు నుంచి తొలగించిందని గుర్తు చేసింది. దాంతో ఇలాంటి వ్యవహారాల్లో కరుణ చూపాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. వైఖరిని మార్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారంది. ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తు తీర్పు ఇచ్చింది.

AP High Court Notices: విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.