ETV Bharat / state

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు.. మరో పదేళ్లు పొడిగించిన ప్రభుత్వం - ఎస్టీ సబ్ ప్లాన్

Sc, St Sub Plan : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు తేదిని మరో పది సంవత్సరాలకు పొడిగించింది. ఆ మేరకు గెజిట్​ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఇప్పటికి ఆర్డినెన్స్​ తీసుకువచ్చిన ప్రభుత్వం.. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయనుంది.

Sc, St Sub Plan
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం
author img

By

Published : Jan 22, 2023, 10:08 PM IST

Sc, St Sub Plan : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో పదేళ్లు పెంచింది. సబ్​ప్లాన్ గడువును పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్​ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పదేళ్ల గడువుతో రూపొందించి 2013లో జనవరి 24 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం గడువు రేపటితో ముగియనుంది. చట్టానికి గడువు దగ్గర పడుతుండటంతో పదేళ్లు పెంచాలని.. ఇటీవల ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం ఆ మేరకు చట్టం గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రస్తుతం ఆర్డినెన్స్​ను తీసుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. రానున్న శాసన సభ సమావేశాల్లో చట్ట సవరణ చేయనుంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.