Squads for Monitoring Government Employees: ఉద్యోగులపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెంచుతోంది. వారిని కట్టడి చేసేందుకు ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇప్పటికే ముఖ గుర్తింపు ఆధారిత హాజరు అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం.. తాజాగా కార్యాలయాల్లో సిబ్బంది ఉంటున్నారా లేదా అన్నది పరిశీలించేందుకు సిద్ధమైంది. ఉద్యోగుల పని విధానం హాజరుపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించేందుకు ప్లయింగ్ స్వాడ్‌లను ఏర్పాటు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హాజరుపై తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. హాజరు నమోదు చేసుకుని కొందరు ఉద్యోగులు వెళ్లిపోతున్నారన్న సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ప్లయింగ్ స్వాడ్‌లను ఏర్పాటు చేశారు. ఇటీవల సీఎంతో జరిగిన సమీక్షలో చిత్తూరు కలెక్టర్‌ను జగన్ ఆదేశించారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉంటున్నారా వెళ్లిపోతున్నారో పరిశీలించాలన్నారు. దీంతో కలెక్టర్ ప్లయింగ్ స్వాడ్‌ను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
ఇవీ చదవండి: