AP LAGS IN ATTRACTING FOREIGN INVESTMENTS : విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం 14స్థానంతో సరిపెట్టుకొంది. తెలంగాణ మన కంటే మెరుగ్గా ఏడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర మొదటి స్థానంలో, కర్ణాటక రెండు, గుజరాత్ మూడు, దిల్లీ నాలుగో స్థానాల్లో నిలిచాయి. ఎడారి ప్రాంతంగా ఉన్న రాజస్థాన్.. చిన్న రాష్ట్రం ఝార్ఖండ్ కూడా విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ కన్నా ముందు వరుసలో ఉన్నాయి.
కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం తన వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం 2019 అక్టోబరు నుంచి 2022 జూన్ వరకు రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు మొత్తం 4 వేల 56.89 కోట్లు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో 97 భారీ, మెగా పరిశ్రమల ఏర్పాటు ద్వారా 39 వేల 517 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు.
మౌలిక సదుపాయాల పరంగా తీర ప్రాంతం, నాలుగు పోర్టులు, అయిదు విమానాశ్రయాలు, రోడ్డు రవాణా వ్యవస్థ, మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా.. రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో విదేశీ పెట్టుబడులు రావడం లేదు.
ఇవీ చదవండి: