Anganwadi Workers Meeting: నేటి నుంచి ఫేస్ యాప్ వినియోగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బహిష్కరిస్తున్నట్లు అంగన్వాడీ హెల్పర్స్, వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రకటించారు. విజయవాడ బాలోత్సవ భవన్ లో జరిగిన రాష్ట్ర కార్యశాలకు వివిధ జిల్లాల నుంచి అంగన్వాడీలు హాజరయ్యారు. 2019 ఎన్నికల ముందు తెలంగాణ కంటే ఏపీలో అంగన్వాడీలకు అదనంగా వేతనం ఇస్తానని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ తాను ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. తెలంగాణలో టీచర్లుగా పని చేస్తున్న వారికి రూ. 13వేల 650 రూపాయలు ఇస్తుంటే ఏపీలో కేవలం రూ.11వేల 500 మందలు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం తమ శ్రమ దోపిడీ చేస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు మండిపడ్డారు. అంగన్వాడీ హెల్పర్లకి తెలంగాణలో రూ. 9వేల వేతనం ఇస్తుంటే ఏపీలో 7వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అందిస్తున్న సరుకుల్లో నాణ్యత కొరవడిందని ఆరోపించారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను రద్దు చేసి ఆ స్థానంలో పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో పిఆర్సీ, పదవీవిరమణ బెనిఫిట్స్ కల్పిస్తుంటే మన రాష్ట్రంలో అవేమీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త నిరవదిక ఆందోళనలు చేపడతామని అంగన్వాడీలు హెచ్చరించారు.
తమ హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వంకక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. నిరసనలను పోలీస్ చర్యలతో అణిచి వేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఐసీడీఎస్ అనేది ఆహారం, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యం ఇస్తుందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో అలాంటి ప్రోత్సాహం కనిపించడం లేదని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం అంగన్వాడీలు అడిగే న్యాయమైన డిమాండ్‌పై స్పందించాలని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అంగన్వాడీలకు పనిభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్లుగా జీతాలు లేవని వెల్లడించారు. అంగన్వాడీలు అద్దెలు, ఇతర ఖర్చులకు మెుదట పెట్టుబడులు పెట్టి తరువాత.. ఆరునెలలకు డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు.
Prathidwani: హామీల అమలు కోసం.. అంగన్వాడీల ఆందోళన బాట
ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పని చేయడం లేదని.. స్వంత ఫోన్లతో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంగన్వాడీలు ఆరోపించారు. వివిధ యూప్‌ల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. హక్కుల కోసం పోరాడేవారిపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మస్యలపై లేఖలు రాస్తే... ఆయన స్పందించేవారని.. జగన్ ప్రభుత్వంలో హక్కుల కోసం అడిగితే అరెస్ట్‌లు చేస్తున్నారని అంగన్వాడీలు మండిపడ్డారు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు అంగన్వాడీలపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.
Anganwadis Chalo Vijayawada: అంగన్వాడీల ఛలో విజయవాడపై.. పోలీసుల ఉక్కుపాదం..!