ETV Bharat / state

సంక్రాంతి నెలలోనైనా సకాలంలో జీతాలు అందుతాయో లేదో...? - నరేెంద్ర మోదీ ని కలిసిన జగన్

Andhra Pradesh Appulu In YCP Govt: ఎవరైనా కొత్త సంవత్సరానికి ఆనందంతో స్వాగతం పలుకుతారు. కానీ వైసీపీ సర్కారు అనాలోచిత విధానాలతో కొత్త ఏడాదికి అప్పులతో స్వాగతం పలకాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉద్యోగులకు నవంబరు నెల జీతాలు, పెన్షన్లు చెల్లించడానికే నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. కొత్త ఏడాది సంక్రాంతి నెలలోనైనా సకాలంలో జీతాలు అందుతాయో లేదోనని వేతనజీవులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుని కొత్త రుణాలు సంపాదించుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక యంత్రాంగం దిల్లీలోనే ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ సైతం దిల్లీ వెళ్లడం, బుధవారం ప్రధాని మోదీతో సమావేశమవుతుండటమూ ఈ సందర్భంగా చర్చనీయాంశమవుతోంది.

అప్పు
APPU
author img

By

Published : Dec 28, 2022, 7:33 AM IST

Andhra Pradesh Appulu In YCP Govt:వైసీపీ సర్కారు అనాలోచిత విధానాలతో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పు పుడితే తప్ప రోజు గడవని పరిస్థితులు రాష్ట్రాన్ని కలవరపెడుతున్నాయి. ఉద్యోగులకు నవంబరు నెల జీతాలు, పెన్షన్లు చెల్లించడానికే నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. రిజర్వుబ్యాంకు బహిరంగ మార్కెట్‌ రుణం పొందే పరిస్థితులూ ఈ నెలలో లేవనిపించడం లేదు. కొత్త ఏడాదికి అప్పులపై ఆశతోనే స్వాగతం పలకాల్సిన పరిస్థితి తలెత్తింది.

కొత్త ఏడాదికి... అప్పులతోనే ఆహ్వానం

రాష్ట్ర సర్కారు ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేసింది. రిజర్వుబ్యాంకు ఇచ్చే అన్ని వెసులుబాట్లు వాడేసుకుంది. ఓవర్‌ డ్రాఫ్ట్‌లో చిక్కుకుని బయటపడేందుకు అష్టకష్టాలు పడ్డ పరిస్థితులు డిసెంబరులో ఎదురయ్యాయి. 3 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కొత్త ఏడాది సంక్రాంతి నెలలోనైనా సకాలంలో జీతాలు అందుతాయో లేదోనని వేతనజీవులు ఆందోళనలో ఉన్నారు. సంక్రాంతికి పిల్లలకు బట్టలు కొనాలన్నా, పండగ చేసుకోవాలన్నా జీతాలు రావాల్సిందే! జనవరిలో రాష్ట్రం అప్పులకు అనుమతి పొందే పరిస్థితులు ఉన్నాయా అనేది సందేహమే. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రుణ పరిమితిని దాటి రాష్ట్రం బహిరంగ మార్కెట్‌ రుణాలు, ఇతర రుణాలు సమీకరించేసింది. ఓవర్‌ డ్రాఫ్ట్‌ నుంచి బయటపడకపోతే ఖాతాలన్నీ స్తంభింపజేస్తామని రిజర్వుబ్యాంకు 2సార్లు రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శికి లేఖ రాయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుని కొత్త రుణాలు సంపాదించుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక యంత్రాంగం దిల్లీలోనే ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ సైతం దిల్లీ వెళ్లడం, బుధవారం ప్రధాని మోదీతో సమావేశమవుతుండటమూ ఈ సందర్భంగా చర్చనీయాంశమవుతోంది.

ఈ నెల 9న ఒకసారి ఆర్‌బీఐ లేఖ రాస్తూ ఏడు రోజులుగా రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌లోనే ఉందని పేర్కొంది. 3నెలల కాలంలో 36 రోజులకు మించి ఓవర్‌ డ్రాఫ్ట్‌ పరిస్థితుల్లో ఉండకూడదనే నిబంధనలు గుర్తుచేస్తూ దాని నుంచి బయటకు రాకపోతే ఖాతాలు స్తంభింపజేయాల్సి ఉంటుందని లేఖలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకువచ్చి ఆర్‌బీఐకి చెల్లించి బయటపడింది. 15వ తేదీన రిజర్వుబ్యాంకు మరోసారి హెచ్చరించింది. మళ్లీ 5 రోజులుగా ఓడీలో ఉన్నారని పేర్కొంది. ప్రస్తుత త్రైమాసికంలో ఆ రోజు నాటికి 25 రోజుల పాటు ఓడీలో ఉన్నట్లు పేర్కొంది. రెండోసారి ఓడీ నుంచి బయటపడేందుకు కేంద్ర నిధులే దిక్కయ్యాయని సమాచారం. కేంద్రం నుంచి పన్నుల వాటాల రూపంలో వచ్చిన మొత్తమూ, గృహ నిర్మాణ నిధుల కింద వచ్చిన 11 వందల కోట్లు కలిపి గండం నుంచి బయటపడింది.

ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏటా కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 3.5 శాతం మేర నికర రుణ పరిమితిగా పేర్కొంటుంది. ఆ విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44వేల 574 కోట్లు రూపాయల నికర రుణ పరిమితిగా కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయించింది. తొలి తొమ్మిది నెలల్లో 43 వేల 303 కోట్లు రూపాయల రుణాలు తీసుకోవచ్చని పేర్కొంది. కానీ నవంబరు నాటికే 43వేల 303 కోట్ల రుణం తీసుకోవడంతో పాటు, విద్యుత్తు సంస్కరణల అమలు పేరుతో కేంద్రం అదనంగా రుణాలకు అనుమతి ఇచ్చింది. అవి కూడా కలిపి ఇప్పటికే 45 వేల 300 కోట్ల రుణాలను రాష్ట్రం సమీకరించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల ఎలా గట్టెక్కాలనే చర్చ జరుగుతోంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.