ETV Bharat / state

విచారణకు రండి.. మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు

AP CID issued notices to ex minister Narayana: రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయనే కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడి అధికారులు మాజీ మంత్రి నారాయణ, ఆయన భార్య, కుమార్తెలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6,7 తేదీల్లో విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

ex minister Narayana
ex minister Narayana
author img

By

Published : Feb 28, 2023, 10:13 PM IST

Updated : Feb 28, 2023, 10:25 PM IST

AP CID issued notices to ex minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో మాజీ మంత్రి నారాయణపై సీఐడి అధికారులు గతంలో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి సీఐడి అధికారులు నేడు నారాయణ, ఆయన భార్య, కుమార్తెలకు నోటీసులు జారీ చేశారు. మార్చి 6, 7 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులో తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి ఇటీవల నారాయణ కుమార్తె ఇంట్లో తనిఖీలు చేపట్టారు. తాజాగా నోటీసులు జారీ చేశారు. నారాయణ, ఆయన భార్య, ఎన్‌సీపీ ఐఆర్‌ఏలో సిబ్బంది ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ అంజనీ కుమార్‌లను ఈనెల 6వ తేదీన సీఐడి విచారణకు హాజరు కావాలని తెలిపారు. నారాయణ కుమార్తెలు సింధూర, షరణీ, బంధువులు పునీత్, వరుణ్ కుమార్‌లకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. జారీ చేసిన నోటీసుల్లో ఈ నెల 7న సీఐడి విచారణకు హాజరుకావాలని తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే: అమరావతి ప్రాంతంలో ఉన్న అసైన్డ్‌ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి.. 2020వ సంవత్సరంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషినల్‌ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు ఆయన కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ డీఎస్పీ అప్పట్లో ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

ఈ క్రమంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద హాజరుకావాలని సీఐడీ గతంలో నోటీసులు జారీ చేసింది. దీంతో నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం 15 ఏళ్లలోపు పిల్లలను, మహిళలను, 65 ఏళ్లు దాటిన పురుషులను విచారణ నిమిత్తం ఠాణాలకు పిలవడానికి వీల్లేదన్నారు.

అధికారులు ఇళ్ల వద్దకే వెళ్లి విచారించాలన్నారు. నారాయణ 65 ఏళ్ల పైబడినవారని, శస్త్రచికిత్స చేయించుకున్నారని, కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని ఆయన కోర్టుకు తెలిపారు. నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా సీఐడీ కార్యాలయానికి రావాలని జారీ చేసిన నోటీసులు చెల్లదన్నారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్దే న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని తెలియజేస్తూ.. సీఐడీని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో మరోసారి రాజధాని భూముల వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ, ఆయన భార్య, కుమార్తెలకు.. సీఆర్పీసీ 41ఏ కింద మార్చి 6, 7న విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.

ఇవీ చదవండి

Last Updated : Feb 28, 2023, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.