ETV Bharat / state

నందిగామలో అడుసుమల్లి సూర్యనారాయణ రావు శతజయంతి ఉత్సవాలు - మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు

కేవీఆర్ కళాశాల వ్యవస్థాపకులు, నందిగామ మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి సూర్యనారాయణరావు శతజయంతి ఉత్సవాలను నందిగామలో  ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్ రావు మాట్లాడారు. నందిగామ ప్రాంతంలో విద్యాభివృద్ధికి సూర్యనారాయణ కృషి చేశారని కొనియాడారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు మాట్లాడుతూ తాను ఈ స్థాయిలో ఉండటానికి సూర్యనారాయణరావు కారణమని తెలిపారు. అడుసుమల్లి అన్ని విషయాల్లోనూ నిస్వార్ధంగా, నిజాయితీగా పని చేశారని కొనియాడారు.

Adusumalli Suryanarayana Rao
Adusumalli Suryanarayana Rao
author img

By

Published : Oct 1, 2022, 10:31 PM IST

అడుసుమల్లి సూర్యనారాయణ రావు శతజయంతి ఉత్సవాలు

నందిగామలోని కాకాని వెంకటరత్నం కళాశాల ఆవరణలో కేవీఆర్​కళాశాల వ్యవస్థాపకులు, నందిగామ మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి సూర్యనారాయణరావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, వసంత నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, రామోజీ ఫిలిం సిటీ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, కళాశాల పాలకవర్గం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ఎర్రంరెడ్డి బాబురావు అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. నందిగామ ప్రాంతంలో విద్యాభివృద్ధికి సూర్యనారాయణరావు కృషి చేశారని కొనియాడారు. ఆయన ఏర్పాటు చేసిన కళాశాలలో ఎంతోమంది విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయికి వెళ్లారని తెలిపారు. ఉద్యోగుల నియామకం నుంచి అన్ని విషయాల్లోనూ నిస్వార్ధంగా, నిజాయితీగా పని చేశారని కొనియాడారు.

మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను ఈ స్థాయిలో ఉండటానికి సూర్యనారాయణరావు కారణమని తెలిపారు. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి కోసం ప్రత్యేకంగా కళాశాల ప్రారంభించారన్నారు.. అదే కళాశాల నుంచి చదువుకొని ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని కొనియాడారు. అటువంటి మహనీయుడు నందిగామ ఎమ్మెల్యేగా నిజాయితీగా పనిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొద్దులూరు రామారావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సూర్యనారాయణరావు కుటుంబ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.