ETV Bharat / state

AP Crime News: తెనాలిలో యువతి ఆత్మహత్య.. చుక్కల దుప్పిని ఢీకొట్టిన వాహనం - ఏపీ నేర వార్తలు

AP Crime News: గుంటూరు జిల్లాలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన తురుమెళ్ల రమ్య(22)గా గుర్తించారు. ఆమె కొద్ది రోజులుగా తెనాలిలో ఒంటరిగా నివాసం ఉంటోంది. మరో వైపు ఎన్టీఆర్ జిల్లాలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఘటనలో కోనసీమ జిల్లాలో గోదావరిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 22, 2023, 12:17 PM IST

AP Crime News : యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన తురుమెళ్ల రమ్య(22) కొద్ది రోజులుగా తెనాలిలో ఒంటరిగా నివాసం ఉంటోంది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లికి ఫోన్ ద్వారా రమ్య సమాచారం ఇచ్చింది. తల్లి వెంటనే రమ్య ఫోన్​ చేయగా ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో వారు తెనాలి చేరుకున్నారు. అప్పటికే ఇంట్లోని ఫ్యాన్​కు రమ్య ​చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
టూ టౌన్ సీఐ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం యాంకర్​గా పనిచేస్తూ జీవనం సాగించే రమ్య.. తెనాలిలో కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తోందని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రమ్య తల్లిదండ్రులకు ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తల్లితో ఫోన్ మాట్లాడే సమయంలోనే రమ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు వెంకట్రావు తెలిపారు.

చుక్కల దుప్పిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ చుక్కల దుప్పిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆ దుప్పి సంఘటనా స్థలంలోనే మృత్యవాత పడింది. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన చుక్కల దుప్పిని స్వాధీనం చేసుకున్నారు.

గోదావరిలో పడి ఇద్దరు యువకులు మృతి : కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గోదావరిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. కొత్తపేటకు చెందిన గెద్దాడ కిరణ్ కుమార్(22), అయినవిల్లి మండలం పెద్దపాలేనికి చెందిన మోటూరి త్రిలోక్(18) మరో నలుగురు కలిసి సరదాగా జొన్నాడ గోదావరి వద్దకు వెళ్లారు. వారిలో ఒకరిది పుట్టిన రోజు కావడంతో వేడుకలు జరుపుకొని సరదాగా ఆరుగురు స్నానాలు చేసేందుకు గోదావరిలో దిగారు. గోదావరిలో లోతు ఎక్కువగా ఉండడంతో కిరణ్ కుమార్, మోటూరి తిలక్ గల్లంతయ్యారు. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు భారీగా జరపడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వాటిలో నీరు చేరడం లోతు అంచనా వేయలేక నీటిలో మునిగి మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు అక్కడకు చేరుకుని నిరసన తెలిపారు.

ద్విచక్ర వాహానాన్ని ఢీకొన్న కారు.. ఒకరు మృతి : ఎన్టీఆర్ జిల్లా మైలవరం సమీపంలోని పాత పెట్రోల్ బంకు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. మైలవరం నుంచి కుంట ముక్కల వైపు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఆ రహదారిలో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొని ఒక వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.