ETV Bharat / state

Ration Survey: నిలిచిపోయిన బియ్యానికి బదులు నగదు సర్వే - బియ్యానికి బదులుగా నగదుపై నంద్యాలలో ప్రయోగత్మక సర్వే

Ration Survey: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా చేసే విధానంలో ప్రభుత్వం నూతన పద్ధతి తెస్తోంది. బియ్యానికి బదులుగా... నగదు ఇచ్చే విషయమై నంద్యాల, అనకాపల్లి, గాజువాక, నర్సాపూర్​లో ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టారు. అయితే పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆకస్మికంగా ఇచ్చిన ఆదేశాలతో సర్వే ఆగిపోయింది.

Ration Survey
నంద్యాలలో ఆగిపోయిన బియ్యానికి బదులు.. నగదు సర్వే
author img

By

Published : Apr 19, 2022, 1:18 PM IST

Updated : Apr 19, 2022, 2:00 PM IST

Ration Survey: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఇస్తున్న బియ్యానికి బదులుగా... నగదు ఇచ్చే విషయమై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో నంద్యాల సహా ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టారు. అంతలోనే పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆకస్మికంగా ఇచ్చిన ఆదేశాలతో సర్వే నిలుపుదల చేశారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి చరవాణిలో యాప్ డౌన్​లోడ్ చేసే ప్రక్రియకు ఉపక్రమించారు. పట్టణంలోని 93 దుకాణాల పరిధిలో 49, 853 రేషన్ కార్డులు ఉన్నాయి. సోమవారం సర్వే జరుగుతుందని వార్డు వాలంటీర్లు ప్రచారం చేశారు.

తెదేపా నాయకుల ఆగ్రహం: బియ్యానికి బదలుగా నగదు బదిలీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక తెదేపా నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వానివి అనాలోచిత నిర్ణయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: Visa Slots: మీరు అమెరికా వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకో శుభవార్త

Last Updated : Apr 19, 2022, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.