CHEMICAL LEAKAGE : నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామ సమీపంలోని అగ్రిసోల్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. అనిల్, హుస్సేన్ అనే కార్మికులు విధుల్లో భాగంగా.. పైప్ లైన్ బోల్ట్లు తీస్తుండగా ఓ బోల్ట్ విరిగింది. దాంతో కెమికల్ లీకై వారి మీద పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన ఫ్యాక్టరీ యాజమాన్యం హుటాహుటిన వీరిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఇద్దరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గతంలో కూడా ఈ ఫ్యాక్టరీలో చాలా ప్రమాదాలు జరిగాయి.. కానీ వీరిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి: