Handloom Silver Saree Made By Sirisilla handloom: తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన యువ చేనేత కార్మికుడు మగ్గంపై వెండి చీరను నేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్.. చేనేత చీరల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఈ మధ్యనే సిరి చందనం పట్టుగా సిరిసిల్ల చీరలకు పేరు రావడానికి కారణమయ్యాడు. ఇలా ఎన్నో ప్రయోగాలు చేస్తూ.. నేడు చేనేతకే అందం తెచ్చేలా వెండి చీరను మగ్గంపై నేశాడు.
సిరి చందనం పట్టుగా సిరిసిల్ల చీరకు గుర్తింపు రావడంతో.. ఆ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, తల్లి జ్యోతి సిరి చందనం పట్టు చీరతో పూర్తిగా వెండి దారాలతో చీర కావాలని కోరారు. ఆమె కోరిక మేరకు సిరి చందనంకు వచ్చిన గుర్తింపు మేరకు.. అదే స్ఫూర్తితో వెండి చీరను నేశారు. ఈ చీరను నెల పది రోజుల శ్రమించి రూపొందించడం జరిగిందని విజయ్ తెలిపారు.
ఈ చీరకు 90 గ్రాముల వెండిని కలపడం జరిగిందన్నాడు. గతంలో ఎన్నో ప్రయోగాలు చేసిన విజయ్ ఈ ప్రయోగంతో మరోసారి సిరిసిల్లఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ చీర 600 గ్రాములు ఐదున్నర మీటర్ల 48 ఇంచుల పన్నా నేయడం జరిగిందని, ఈ చీర కోసం రూ. 45,000 వెచ్చించినట్లు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: