CM JAGAN : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్.. రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను విడుదల చేశారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడారు. అవినీతి తావులేకుండా పారదర్శకంగా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని జగన్ అన్నారు. రైతులకు మేలు చేసేలా క్రమం తప్పకుండా.. ప్రతి పథకాన్ని అందిస్తున్నామని చెప్పారు. మూడున్నరేళ్లలో.. రైతుల కోసం లక్షా 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు.
రాష్ట్ర ప్రజలకు ఇంత చేస్తున్నా.. కొందరు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆళ్లగడ్డ సభకు ప్రజలను తరలించే బాధ్యతను.. సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో వాలంటీర్లకు అప్పజెప్పారు. వాలంటీర్లు సభకు తరలించిన జనం.. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే వెనుదిరిగారు. ఆపేందుకు పోలీసులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రయత్నించినా.. పట్టించుకోకుండా ప్రజలు ఇళ్లకు వెళ్లిపోయారు.
ఇవీ చదవండి: