Gadapa Gadapaku: మంత్రి గుమ్మనూరు జయరాంకి కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో.. సమస్యలు స్వాగతం పలికాయి. గడపగడపకు మన ప్రభుత్వం అంటూ వెళ్లిన మంత్రిని.. తాగునీటి సమస్య తీర్చాలంటూ మహిళలు నిలదీశారు. 20 రోజులకోసారి.. నీరు వస్తోందంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మహిళలకు సర్దిచెప్పేందుకు.. మంత్రి విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు సహనం కోల్పోయి.. ఓ మహిళ చేతిలోని బిందెను తోసేశారు.
ఓ ప్రార్థన మందిరం కోసం దాతలు ఇచ్చిన స్థలాన్ని.. కమిటీ సభ్యులు అమ్ముకున్నారంటూ శ్రీసత్యసాయి జిల్లా తలుపులలో స్థానికులు ధర్నాకు దిగారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వస్తున్నారని తెలిసి..ఆయనకు సమస్య చెప్పుకునేందుకు.. రోడ్డుపై బైఠాయించారు. వారి మాటల్ని పట్టించుకోకుండా.. ఎమ్మెల్యే వెళ్లిపోయారు. సిద్ధారెడ్డి వైఖరిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం సోముదేవుపల్లిలో.. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు సమస్యల సెగ తగిలింది. ఎమ్మెల్యేకి స్థానిక మహిళలు సమస్యలు ఏకరవు పెట్టారు. వరాహ నది గట్టుపై రోడ్డు, వీధి దీపాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి నచ్చజెప్పేందుకు ఎమ్మెల్యే ఇబ్బంది పడ్డారు.
ఇవీ చూడండి