కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద నేలతలమర్రికి చెందిన వైకాపా నేతలు ధర్నా చేశారు. దేవనకొండ మండలం నేలతలమర్రి గ్రామ సర్పంచ్‌గా వైకాపా బలపరిచిన అభ్యర్థిగా గొల్ల మల్లమ్మ పోటీ చేశారు. ఈనెల 21న జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థికి అన్యాయం జరిగిందని వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు కర్నూలుకు వెళ్లారు. మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికలలో కౌంటింగ్ అనంతరం మల్లమ్మ 5 ఓట్లతో గెలిచారని అధికారులు ప్రకటించి... తరువాత రీ కౌంటింగ్ నిర్వహించారని నాయకులు పేర్కొన్నారు. రీ కౌంటింగ్‌లో 4 ఓట్లతో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచినట్లు చెప్పారని తెలిపారు. అందుకే రీకౌంటింగ్ అడుగుతున్నామని వివరించారు.
ఇదీ చూడండి. మందపైకి దూసుకొచ్చిన లారీ.. 45 గొర్రెలు మృతి