ETV Bharat / state

ప్రేమించుకుని.. పేరెంట్స్​ను ఒప్పించారు! ఇంతలో మరో పెళ్లి చేసుకున్న వరుడు.. యువతి ఆత్మహత్య! - యువతి ఆత్మహత్య

suicide
ఆత్మహత్య
author img

By

Published : Jun 5, 2023, 8:45 AM IST

Updated : Jun 5, 2023, 11:43 AM IST

08:38 June 05

కర్నూలు ఇందిరాగాంధీ నగర్‌లో యువతి ఆత్మహత్య

ప్రేమించి.. తల్లిదండ్రులను ఒప్పించారు.. ఇంతలో మరో పెళ్లి చేసుకున్న వరుడు.. యువతి ఆత్మహత్య

Woman Committed Suicide: ప్రేమించి యువకుడు మోసం చేశాడన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలులోని ఇందిరాగాంధీ నగర్​లో జరిగింది. వాళ్లిద్దరూ అయిదు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే తల్లిదండ్రులను ఒప్పించారు. మరికొన్ని రోజులలో పెళ్లి జరుగుతుంది అనగా.. ఇంతలో ఆ అబ్బాయి మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి.. ఆత్మహత్య చేసుకుంది.

అసలు ఏం జరిగిందంటే..?: పద్మావతి అనే యువతి.. నందికొట్కూరు పాతకోటకు చెందిన వినోద్​ కుమార్ గత అయిదు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాలను పెళ్లికి ఒప్పించారు. యువతి తల్లిదండ్రులను కూడా ఆ యువకుడు ఒప్పించాడు. తనను ప్రాణంగా ప్రేమించిన అబ్బాయే తన జీవితంలోకి వస్తున్నాడని ఆ యువతి ఎంతో సంతోషపడింది. తనతోనే జీవితాన్ని ఊహించుకుంది.

డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రిని కడతేర్చిన మైనర్ బాలుడు

ఈ సంతోష సమయంలో.. మార్చి 9వ తేదీన వీరి ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 10వ తేదీన పెద్దలు పెళ్లి మూహూర్తం ఫిక్స్ చేశారు. ఇంతలో ఊహించని మలుపు తీసుకుంది. ఒక్క ఫోన్ కాల్..​ ఆ అమ్మాయి కలలను తలకిందులు చేసింది. పోలీసులు ఫోన్ చేసి.. వినోద్ అనే యువకుడికి పెళ్లి అయిపోయిందని.. ఏమైనా సందేహాలు ఉంటే స్టేషన్​కు రావాలని చెప్పారు.

అయిదు సంవత్సరాలు ప్రేమించి.. తానే ప్రాణంగా ఎన్నో కలలు కన్న అబ్బాయి మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో విషపూరితమైన రసాయనాలు తాగి.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. దీనిని గమనించిన యువతి కుటుంబ సభ్యులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. ఐదు సంవత్సరాలు ప్రేమించి తమ కుమార్తెను మోసం చేసిన వినోద్​ను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. ఆత్మహత్య చేసుకున్న పద్మావతి సూసైడ్ నోట్లో తన చావుకి కారణం పెళ్లి కుమారుడే అని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

"ఆ అబ్బాయి తల్లిదండ్రుల అంగీకారంతో ఎంగేజ్​మెంట్ కూడా చేపించాము. పెళ్లి వరకూ తీసుకొని వచ్చి.. మా అమ్మాయిని మోసం చేశాడు. ఇప్పుడు వేరే పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ అబ్బాయి 31వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు మాకు ఫోన్ చేసి చెప్పారు. జూపాడు బంగ్లా ఎస్సై మాకు ఫోన్ చేసి.. మీ అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది. మీరు ఏమైనా మాట్లాడటానికి వస్తారా అని అడిగారు. వాడు మోసం చేసి.. వేరే పెళ్లి చేసుకున్నాడు అనే బాధ భరించలేక చనిపోయింది". - మధు, మృతురాలి తండ్రి

Last Updated : Jun 5, 2023, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.