కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలో పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలను మాజీఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో సుమారు 3వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం చేశామని వివరించారు.
మాజీఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు హైకోర్టుకు వెళ్లి పట్టాలు ఇవ్వకుండా మధ్యంతర ఉత్తర్వులు తీసుకొచ్చారని కాటసాని ఆవేదన వ్యక్తం చేశారు. 2011లో సైతం ఇదే మాదిరిగా హైకోర్టుకు వెళ్లి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు.
తిరిగి అదే పద్ధతిలో పేదలకు ఇళ్ల పట్టాలు దక్కకుండా చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలకు కులమతాలకు అతీతంగా పేదలందరికీ ఇళ్ల పట్టాలతో పాటు సుమారు 2.5 లక్షలతో ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి