భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. క్రైస్తవులపై చేసిన వాఖ్యలు సరికాదని కర్నూలులో వైకాపా నాయకులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర నాయకులు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య చిచ్చుపెట్టే వాఖ్యలు చేయడమేంటని వైకాపా రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య ప్రశ్నించారు. జగన్ భాజపాకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇలాంటి విమర్శలకు పాల్పడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక.. మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలు మట్లాడడం సరికాదన్నారు.
ఇదీ చదవండి:
తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటన...ఘన స్వాగతం పలికిన అభిమానులు