భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవాలని.. కర్నూలు పార్లమెంట్ వైకాపా ఇన్ఛార్జ్ బీవై రామయ్య అన్నారు. కర్నూలులో మాట్లాడుతూ.. శ్రీశైలంలో జరిగిన అవినీతిలో తమ పార్టీ నేతలకు సంబంధముందంటూ బైరెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. ఆ కేసులో నిందితులందరినీ ఇప్పటికే అరెస్టు చేశారని తెలిపారు.
శ్రీశైలంలో జరిగిన అవినీతికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రోజుకో పార్టీ మారుతున్న బైరెడ్డికి తమను విమర్శించే హక్కు లేదన్నారు. వీలైతే పోతిరెడ్డిపాడు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు తెప్పించాలని సూచించారు.
ఇవీ చదవండి... ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లో సందడి..