కర్నూలు జిల్లా సమీపంలోని తుంగభద్ర నది వద్ద ఉన్న జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని డీసీయం వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మాధవి అనే మహిళా కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా... మరో వ్యక్తికి స్వల్పగాయాలు అయ్యాయి. మృతి చెందిన కానిస్టేబుల్ కు నాలుగు రోజుల క్రితమే వివాహ నిశ్చితార్థం జరిగింది. ఇంతలోనే మాధవి మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: