ETV Bharat / state

"ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. మోసం చేశాడు" - కర్నూలు కలెక్టరేట్​ వద్ద మహిళ నిరసన

ఓ వ్యక్తి తనను ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని రోజులకే మోసం చేసి వెళ్లిపోయాడని... కర్నూలు జిల్లా కలెక్టరేట్​ ముందు యువతి బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

Woman protests at kurnool collectorate for a man cheating her
ప్రేమించి పెళ్లిచేసుకున్న వ్యక్తి మోసం చేశాడని మహిళ నిరసన
author img

By

Published : Nov 16, 2020, 8:39 PM IST

కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఓ మహిళా న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా అమ్మాయిపల్లికి చెందిన అశోకమ్మకు కర్నూలు జిల్లా అలంపూర్​కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

కుటుంబ కలహాలతో భార్యభర్తలు విడిపోయినట్లు అశోకమ్మ తెలిపింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా పోలకల్ కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పరుశురాం తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు భాదితురాలు తెలిపింది. వివాహం అయిన కొన్ని రోజులకే తనను మోసం చేసి వెళ్లిపోయాడని... తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

ఇదీ చదవండి:

జిల్లాల పునర్​ విభజనపై సీఎం జగన్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.