పచ్చని కాపురంలో కొత్తగా కొన్న సెల్ఫోన్ చిచ్చు పెట్టింది. భార్యాభర్తల మధ్య వివాదంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని వగరూరులో జరిగింది. పార్వతి భర్త నాగరాజు మూడు రోజుల కిందట 15 వేల రూపాయలు పెట్టి కొత్త ఫోన్ కొన్నాడు. అది చెడిపోవడంతో మరమ్మతుకు మరింత సొమ్ము భార్యను అడిగాడు. లాక్డౌన్ కారణంగా ఇళ్లు గడవడం కష్టంగా ఉందని.. సెల్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తే ఎలా అని భార్య ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపంతో భార్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వీరు జీవనం సాగిస్తుంటారు.
ఇదీ చదవండి: నిశ్శబ్దంగా బుసలు కొడుతున్న కరోనా 2.0!