భర్తను హత్య చేసిన కేసులో భార్య, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బాచేపల్లికి చెందిన కృష్ణకిషోర్ ఈనెల 3న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నగల్లపాడు భవనాసి నదిలో అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నేడు నిందితులను పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణకిషోర్ భార్య భాగ్యలక్ష్మి, వారింట్లో పని చేసే నరసింహుడు ఇద్దరూ కలిసి అతనిని చంపినట్లు తెలిపారు. కృష్ణకిషోర్ తాగుడుకు బానిసై, భార్యపై అనుమానం పెంచుకున్నాడని స్థానికులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అతని భార్య ప్రవర్తన అనుమానాస్పదంగానే ఉండేదని చెప్పారు. ఈ క్రమంలో అతని భార్య భాగ్యలక్ష్మి, వాళ్లింట్లో పనిచేసే పాలేరు నరసింహుడి సాయంతో పథకం ప్రకారం కృష్ణకిషోర్కి మద్యం తాగించి బావనాసి నదిలో తోసేసినట్లు తెలిపారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు చెప్పారు.
ఇవీ చదవండి..