తెదేపాకు చెందిన ముఖ్యనాయకుల ఇళ్లలో ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు స్పందించటం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో తెదేపా నేతలు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. సీఆర్డీఏకు రాష్ట్ర ఖజానా నుంచి కేవలం రూ.177 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగిలినది బోగస్ కంపెనీలకు మళ్లించారని ఆరోపించారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల మాట్లాడుతూ... వైకాపా నాయకులకు ఆంగ్లం రాదనటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఇదీచదవండి