పల్లె జనం గొంతెండుతున్నా.. పట్టించుకునే నాథుడే లేడు! - తాగునీటి సమస్యలు వార్తలు
వేసవి రాకముందే జనం గొంతులు ఎండుతున్నాయి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. గుక్కెడు నీటి కోసం తెల్లవారుజాము నుంచి పనులు మానుకుని వేచి చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆస్పరి మండలం ఐనకల్లులో నీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. 200 కుటుంబాలు ఉన్న గ్రామంలో నీటిని తెచ్చుకునేందుకు ప్రతి ఇంటికీ ఓ ప్రత్యేకమైన తోపుడు బండిని చేయించుకున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం సొంత నియోజకవర్గంలోని పరిస్థితులపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం.