ETV Bharat / state

WATER FLOW: ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద - శ్రీశైలం ప్రాజెక్టు వార్తలు

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,54,997 క్యూసెక్కుల వస్తోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు ఉండగా..ప్రస్తుత నీటిమట్టం 876.50 అడుగలకు చేరింది. ఎడమ జలవిద్యుత్ కేంద్రం నుంచి దిగువకు 34,255 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. పోలవరం, తమ్మిలేరు జలాశయానికి సైతం వరద నీరు వచ్చి చేరుతోంది.

ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
author img

By

Published : Sep 8, 2021, 8:15 AM IST

Updated : Sep 8, 2021, 10:43 PM IST

శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి లక్షా 54 వేల 997 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 876.50 అడుగలకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా... ప్రస్తుతం దాదాపు 170.664 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. అక్కడినుంచి నాగార్జునసాగర్‌కు.. 34,255 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు..

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే వద్ద నీటిమట్టం 31 మీటర్లు ఉంది. ఎగువ కాఫర్ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 33 మీటర్లు ఉంది. పోలవరం స్పిల్ వే నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

తమ్మిలేరుకు జలకళ..

పశ్చిమ గోదావరి జల్లా నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం ఇన్​ఫ్లో 7 వేల క్యూసెక్కులు ఉండగా.. జౌట్​ఫ్లో 4 వేల క్యూసెక్కులు ఉంది. ఏలూరు శనివారం పేట వంతెన పైనుంచి వరద ప్రవాహం వస్తుండగా.. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తమ్మిలేరు వరదతో అధికారులు కాలనీలను అప్రమత్తం చేశారు.

జంగారెడ్డిగూడెం మండలం ఎర్రకాల్వ జలాశయానికి వరద వస్తోంది. ఎర్రకాల్వ జలాశయం ఇన్‌ఫ్లో 6 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

కల్యాణపులోవ రెండు గేట్లు ఎత్తివేత..

విశాఖ జిల్లాలో ఉన్న కల్యాణపులోవ ప్రాజెక్టులో మరో రెండు గేట్లు ఎత్తారు. జలాశయం నుంచి 4 గేట్ల ద్వారా 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కల్యాణపులోవ జలాశయం పూర్తి నీటిమట్టం 460 అడుగులు కాగా.. ప్రస్తుతం 459.6 అడుగుల నీటి మట్టం ఉంది.

మున్నేరుకు వరద ప్రవాహం..

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరులో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 60000 క్యూసెక్కుల వరద ప్రవాహం కృష్ణా నదికి చేరుతుంది. లింగాల వంతెనపై వరద పారుతుండటంతో తెలంగాణకు వెళ్లే వాహనాలు పెనుగంచిప్రోలు మీదుగా మళ్లించారు.

సోమశిల నుంచి నీటిని విడుదల చేసిన మేకపాటి..

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నుంచి నీటిని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విడుదల చేశారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్దనరెడ్డి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఐదు వేలు క్యూసెక్కులు నీటిని విడుదల చెసారు. పూజలు నిర్వహించారు. నిండుకుండలా ఉన్న సోమశిల ప్రాజెక్ట్ జలాశయాన్ని పరిశీలించారు. సోమశిల ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రవాహం నీటి విడుదలకు సంబంధించి వివరాలు తెలుగు గంగ చీఫ్ ఇంజనీర్ హరి నారాయణ రెడ్డి సోమశిల ప్రాజెక్టు ఎస్ఈ వివరించారు.

ఇదీ చదవండి:డిగ్రీ అధ్యాపకుల బదిలీలకు సీఎం ఆమోదం

Last Updated : Sep 8, 2021, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.