శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం తగ్గింది. జూరాల, హంద్రీ నుంచి 13,693 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 2,500 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1,252 క్యూసెక్కులు, కల్వకుర్తికి 2,500 క్యూసెక్కులు విడుదల చేశారు.
ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి 41,515 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 853.50 అడుగులు ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటినిల్వ 88.0648 టీఎంసీలు ఉంది.
ఇదీ చదవండి: కొవిడ్ ఆస్పత్రుల్లో.. వైద్యుల నియామకానికి ఉత్తర్వులు జారీ