కర్నూలు నగరంలోని బుధవార పేటలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. శ్రీనివాసులు అవుట్ సోర్సింగ్ పద్దతిలో మామిదాలపాడు విద్యుత్ సబ్ స్టేషన్లో వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి సబ్‌స్టేషన్ సిబ్బంది.. వాచ్మెన్ శ్రీనివాసులను విద్యుత్ పనుల నిమిత్తం.. స్తంభంపైకి ఎక్కించారు. మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు.. కరెంటు షాక్ కొట్టి శ్రీనివాసులు అక్కడికక్కడే చెందాడు. వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని విద్యుత్ పనులను చేయమని ఎలా చెప్పారని బాధిత కుటుంబీకులు నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సబ్‌స్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![సబ్‌స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతో కరెంట్ షాక్ కొట్టి వాచ్మెన్ మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-knl-11-16-corrent-shock-dead-ab-ap10056_16062021125913_1606f_1623828553_390.jpg)
ఇవీ చదవండి: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు