కర్నూలు జిల్లా ఆదోని ఎంపీడీవో కార్యాలయంలో లక్షలు రూపాయలు నిధులు వెచ్చించి కొనుగోలు చేసిన నీటి ట్యాంకర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కౌతాళం మండలంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ నీటి సరఫరా కోసం ఐదు ట్యాంకర్లు కొనుగోలు చేసింది. వీటిని అధికారులు కేటాయించిన ప్రాంతాలకు పంపాల్సి ఉండగా.. వాహనాలు కొనుగోలు చేసిన అనంతరం ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో ఎక్కడి వాహనాలను అక్కడే ఉంచేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నప్పటికీ వీటిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దీంతో ఏడాదిన్నరగా ఎంపీడీవో కార్యాలయంలోనే వృథాగా పడి ఉన్నాయి. వాహనాలకు సంబంధించిన కొన్ని భాగాలు చోరీకి గురువుతున్నాయి.
ఇవీ చూడండి...