ETV Bharat / state

ఓటింగ్​ శాతం పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు - ప్రచారం కార్యక్రమాలు తాాజా వార్తలు

ఓటు వజ్రాయుధం. బుల్లెట్ కన్నా బ్యాలెట్ మిన్న. ఇలాంటి నినాదాలతో కర్నూలు జిల్లాలోని పట్టణ ప్రాంత ఓటర్లను అధికారులు చైతన్యం చేస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్​కు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో.. ఓటు ఎక్కడ ఉందో తెలుసుకునే వీలును కల్పించారు. కర్నూలు జిల్లాలో ఓటర్ చైతన్యం కోసం అధికారులు చేసిన ఏర్పాట్లపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

voter awareness programs
ప్రచార కార్యక్రమాలు
author img

By

Published : Mar 9, 2021, 4:02 AM IST

ఓటింగ్​ శాతం పెంచేందుకు అధికారుల ప్రచార కార్యక్రమాలు

గ్రామాలతో పోల్చితే.. పట్టణాల్లో అక్షరాస్యత ఎక్కువ. ప్రజల్లో చైతన్యం ఎక్కువ. పంచాయితీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతానికిపైగా పోలింగ్ శాతం నమోదైంది. గత మున్సిపల్ ఎన్నికల్లో.. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో కేవలం 44 శాతం పోలింగ్ మాత్రమే రికార్డైంది. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లోనూ తక్కువగానే పోలింగ్ నమోదైంది. గత అనుభవాలను, ఈ మధ్యనే జరిగిన పంచాయితీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చి.. పోలింగ్ శాతం పెంచాలని అధికారులు భావించారు. అందులో భాగంగా గత వారం రోజులుగా ఓటు ప్రాధాన్యతపై విస్తృత ప్రచారం చేపట్టారు. నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేశారు. కళాజాతాలు, ర్యాలీలు నిర్వహించారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

ఓటు తెలుసుకోవడం కోసం ఓ వెబ్​సైట్..

కర్నూలు నగరంలో ప్రజలు తమ ఓటు హక్కు ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి.. kmcelections.com పేరుతో ఓ వెబ్​సైట్​ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ఓటరు.. తన పేరు లేదా ఓటరు కార్డు సంఖ్య ద్వారా.. ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలి? అక్కడికి ఎలా వెళ్లాలి అనే విషయాలను తెలుసుకోవచ్చు. ఈ చర్యల ద్వారా పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని.. అలాంటి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ప్రత్యేక చర్యలు: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.