ETV Bharat / state

క్వారంటైన్​కు వెళ్లని వాలంటీర్​.. కాలనీవాసుల ఫిర్యాదు

కరోనా సోకిందని భయంతో మరణించిన వారిని చూశాం. ముందే జాగ్రత్త పడి.. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినవారూ ఉన్నారు. కానీ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వాలంటీరే కొవిడ్​ సోకినా.. క్వారంటైన్​కు వెళ్లనని పట్టుబట్టాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది.

Volunteer
Volunteer
author img

By

Published : Apr 25, 2021, 10:12 AM IST

క్వారంటైన్​కు వెళ్లనని సచివాలయ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగిన వాలంటీర్​

కర్నూలు జిల్లా ఆదోనిలో వాలంటీర్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. క్వారంటైన్​లో ఉండాలని వైద్యులు సూచించారు. అయినా అతను ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతున్నాడని కాలనీవాసులు.. అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన సచివాలయ సిబ్బంది, పోలీసులు.. వాలంటీర్ ఇంటికి వెళ్లారు. వారితో అతను వాగ్వాదానికి దిగాడు. ఎంతో సేపటికి అంబులెన్స్​లో కాకుండా.. ద్విచక్రవాహనంలో క్వారంటైన్​ సెంటర్​కు వెళ్తానని అధికారులకు చెప్పాడు. అప్పుడు అతన్ని ఐసోలేషన్​ కేంద్రానికి పంపించారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: కరోనా రోగులతో విజయవాడ ప్రభుత్వాసుపత్రి విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.