కర్నూలు జిల్లా నందికొట్కూరులో చేపల వేట కోసం వచ్చిన విశాఖ జిల్లా మత్స్యకారులు చిక్కుకుపోయారు. రెండు నెలల కిందట వచ్చిన 800 మంది.. లాక్ డౌన్ వల్ల చిక్కుకుపోయి నది ఒడ్డున దుర్భర జీవితం గడుపుతున్నారు. తినడానికి తిండి లేక నరకయాతన అనుభవిస్తున్నామని వారు వాపోయారు.
గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా నది సమీపాన గుడిసెలు వేసుకొని కాలం వెళ్లదీస్తున్నట్టు చెప్పారు. తమను విశాఖకు చేర్చవలసిందిగా రోదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి తమను స్వగ్రామాలకు చేర్చవలసిందిగా వేడుకున్నారు.
ఇదీ చదవండి: