కర్నూలు జిల్లా గడివేముల మండలం ఎల్.కే. తండాలో వాలంటీర్‌పై దాడి చేశారు నాటు సారా తయారీ దారులు. ఈ నెల 17న తండాలోని నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ తనిఖీల్లో పోలీసుల వెంట వార్డు వాలంటీర్ హనుమంతు నాయక్ కూడా ఉన్నాడు. అతనే పోలీసులకు సమాచారం ఇచ్చాడని నాటుసారా తయారీదారులు కక్ష పెంచుకున్నారు. శుక్రవారం వారు దాడి చేయటంతో... హనుమంతు నాయక్‌కు గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.