ETV Bharat / state

"విక్టోరియా రీడింగ్‌ రూంను ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వం.." - Victoria Reading‌ Room

Victoria Reading‌ Room: నంద్యాల నూతన జిల్లాగా ఏర్పాటు కానున్న నేపథ్యంలో... పట్టణంలోని పురాతన భవనం విక్టోరియా రీడింగ్ రూమ్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని ట్రస్ట్‌ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. నోటీసులు ఇచ్చి భవనాన్ని స్వాధీనం చేసుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయపోరాటం చేసైనా ట్రస్ట్‌ భవనాన్ని కాపాడుకుంటామని తెలిపారు.

Victoria Reading‌ Room
Victoria Reading‌ Room
author img

By

Published : Mar 18, 2022, 8:54 PM IST

Victoria Reading‌ Room: నంద్యాల నూతన జిల్లా ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల కేటాయింపులు జరుగుతున్నాయి. పట్టణంలోని పురాతన భవనం విక్టోరియా రీడింగ్ రూమ్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ట్రస్ట్‌ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. నోటీసులు ఇచ్చి భవనాన్ని స్వాధీనం చేసుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక కట్టడాన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చడం తగదని అన్నారు. యథాతథంగా ఉంచాలని నంద్యాలలోని విక్టోరియా రీడింగ్‌ రూం క్లబ్‌ సభ్యులు కోరారు. న్యాయపోరాటం చేసైనా ట్రస్ట్‌ భవనాన్ని కాపాడుకుంటామని తెలిపారు.

1901లో గ్రంథాలయ నిర్మాణం..

1901లో బ్రిటీషు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే కొందరు దాతలు గ్రంథాలయ నిర్మాణానికి స్థలాన్ని ఇవ్వగా, స్థానికులు కొందరు కమిటీగా ఏర్పడి విక్టోరియా రీడింగ్‌ రూంను నిర్మించారు. 1956 కంటే ముందున్న ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో ఏర్పాటైన నాలుగు గ్రంథాలయాల్లో ఇదీ ఒకటి. రీడింగ్‌ రూం కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా ఆర్డీవో వ్యవహరిస్తారు.

ఇదీ చదవండి: వీవోఏ నాగ‌ల‌క్ష్మిది ఆత్మహ‌త్య కాదు.. వైకాపా నేత చేసిన హ‌త్య: లోకేశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.