గోరక్షణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డి హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. గోరక్షణ చట్టం అమలు చేయాలని కోరుతుంటే.. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యే మాట్లడడం సరికాదన్నారు. చెన్నకేశవ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ వినాయక ఘాట్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకుంటే అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..
గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాలం చెల్లిన పాత చట్టాల్లో ఒకటని.. ఓట్ల కోసం భాజపా ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్ధలు మతసామరస్యాన్ని దెబ్బ తీస్తున్నాయన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఇలాంటి చట్టం లేదన్నారు. హిందువులకు గోవు పూజ్యనీయమైనదని.. కానీ ముస్లింలకు ఆహార పదార్థము అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి:
somu veerraju: ఎమ్మిగనూరు ఎమ్మెల్యేపై సీఎం వైఖరి ఏంటి?: సోము వీర్రాజు
Viveka Murder Case: 'విచారణ సమయంలో సీబీఐ థర్డ్ డిగ్రీ ప్రయోగించింది'