కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. పీఆర్సీని తక్షణం అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాగమణి ప్రభుత్వాన్ని కోరారు.
ఎన్నికల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. వందలాది మంది ఉపాధ్యాయులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఫెడరేషన్ నాయకులు యల్లప్ప, జయరాజు, శాంతిప్రియ, రఫీక్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: