శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సందడి నెలకొంది. కన్నడ భక్తులు శ్రీశైలానికి తరలివచ్చి సందడి చేస్తున్నారు. మైసూర్‌కు చెందిన మైనార్లు, ఘన చార్యులు సంప్రదాయాన్ని అనుసరించి వాయిద్యాలతో ప్రదర్శన చేశారు. ఆచారం ప్రకారం భ్రమరాంబ దేవికి పట్టుచీరను సమర్పించారు.
మరోవైపు శ్రీశైలంలో కరోనా వైరస్ నివారణ పట్ల దేవస్థానం అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి క్యూలైన్ల వద్ద ఆరోగ్యం పరీక్షిస్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. కన్నడ భక్తులూ మాస్కుల ధరించి దర్శనానికి వచ్చారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా దేవస్థానం అధికారులు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనమూ నిలుపుదల చేశారు.