ETV Bharat / state

సుంకేసుల డ్యామ్​లో పడి అల్లుడు..రక్షించబోయి మామ గల్లంతు - ఆంధ్రప్రదేశ్ వార్తలు

సుంకేసుల జలాశయం విహరయత్రకు వెళ్లి కర్నూలు ఒకటో పట్టణ ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రమాదవశాత్తు డ్యామ్​లో పడి గల్లంతైన ఘటన గురువారం రాత్రి జరిగింది. గల్లంతైన వారికోసం గజ ఈతగాళ్లతో వెతికించగా ఒకరి ఆచూకీ లభించింది. మరొకరి కోసం గాలిస్తున్నారు.

dyam_two_dead
ప్రమాదవశాత్తు సుంకేసుల డామ్​లో పడి మామ అల్లుడు మృతి.
author img

By

Published : Aug 6, 2021, 2:56 PM IST

అల్లుడిని కాపాడబోయి మామ కూడ మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. సుంకేసుల జలాశయం సందర్శనకు వెళ్లి ప్రమాదవశాత్తు అల్లుడు డ్యామ్​లో పడిపోగా కాపాడటానికి ప్రయత్నించిన మామా కూడ నీళ్లలో గల్లంతయ్యాడు.

కర్నూలులోని పాతపట్టణానికి చెందిన సోహైల్ కుటుంబ సభ్యులు సుంకేసుల డ్యాం సందర్శన కోసం వెళ్లారు. ఈ క్రమంలో డ్యాం వద్దనున్న పుష్కర ఘాట్ వద్ద సోహైల్ మేనల్లుడు ముస్తాహీమ్(6) నదిలో పడిపోయాడు. అల్లుడిని కాపాడేందుకు నదిలోకి వెళ్లిన సోహైల్ (32) సైతం గల్లంతయ్యాడు.

గజ ఈతగాళ్లతో నదిలో వెతికించగా సోహైల్ ఆచూకీ లభ్యం అయ్యింది. వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ముస్తాహిమ్ ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు.

ఇదీ చదవండి:

ఎవరికీ అనుమానం రాకుండా అలా చేశాడు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.