ETV Bharat / state

రోడ్డు ప్రమాదాల్లో..'తండ్రి కోసం వెళ్లి కొడుకు.. కూతురు కోసం వెళ్లి తల్లి' మృతి

కర్నూలు జిల్లా నంద్యాల - గాజులపల్లె రహదారిపై బుధవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఆటో నడుపుతూ అదుపు తప్పడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ద్విచక్రవాహనం టైర్ పంచర్ అయి అదుపుతప్పడంతో కింద పడి ఒక మహిళ మృతి చెందారు.

death due to accident on highway
రహదారిపై జరిగిన వేరువేరు ప్రమాదంల్లో ఇద్దరు మృతి
author img

By

Published : Dec 17, 2020, 10:23 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల - గాజులపల్లె రహదారిపై బుధవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. బోయలకుంట్ల మెట్ట వద్ద అరటి పండ్లు విక్రయిస్తున్న షరీఫ్​ తమ కుమారుడు అబ్దుల్లా(11)కు ఆటో ఇచ్చి భోజనం తీసుకురమ్మన్నాడు. అబ్దుల్లా భోజనం తీసుకువస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అబ్దుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు.

ద్విచక్ర వాహనంపై నుంచి పడి...

ఇదే రహదారిపై నందిపల్లె వద్ద గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన నారాయణమ్మ అనే 35 ఏళ్ల మహిళ మృతి చెందింది. నారాయణమ్మ, ఆమె భర్త శ్రీను, బంధువుతో కలిసి నంద్యాల సమీపంలో గురుకుల పాఠశాలలో చదివే కూతురుతో మాట్లాడి, అమ్మఒడి పని ముగించుకుని.. ముగ్గురు కలిసి ఒకే ద్విచక్రవాహనంపై ఇంటికి ప్రయాణిస్తుండగా టైర్ పంచర్ అయ్యింది. ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో నారాయణమ్మ కిందపడి మృతి చెందింది.

ఇదీ చదవండి:

ఇళ్లస్థలాల కేటాయింపు ప్రక్రియతో లబ్ధిదారుల్లో ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.