కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని దిగువ చింతలకొండ గ్రామంలో శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘర్షణలో గాయపడ్డ గ్రామ వాలంటీర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీఐ నారాయణ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గొడవకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులను పోలీసులు వైద్య సేవల కోసం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి ఓటుకు నోటు కేసు... ఇకపై రోజువారీ విచారణ