Two Girls Missing With Love: ఇంటర్ చదువుతున్న బాలికలకు వారు తియ్యని మాటలు చెప్పి వారిని నమ్మించాడు. అమాయకులైనా అమ్మాయిలు కన్న తల్లిదండ్రులను కాదని అతనితో పయనమయ్యారు. తీరా చూస్తే అతను ఓ లాడ్జిలో వారిని నిర్బంధించాడు. విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా పోలీసులు నిందితులను నెల్లూరు పోలీసుల సహాయంతో అరెస్టు చేశారు.
అసలు విషయం: కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు బాలికలకు ఓ లారీ క్లీనర్ బి.సురేష్, అతడి స్నేహితుడుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా చిగురించింది. కానీ అమ్మాయిలు వారిని అమాయకంగా నమ్మారు. ప్రేమించామని నమ్మించగా రెండు రోజుల కిందట వారితో వెళ్లి పోయారు. అలా వారి వెంట వచ్చిన ఆ అమ్మాయిలను యువకులు ఓ లాడ్జిలో బంధించారు. లారీ క్లీనర్ సురేష్ ఓ బాలిక సెల్ ఫోన్ తీసుకుని లారీలో లోడ్ వేసుకుని కృష్ణపట్నం పోర్టుకు వెళ్లాడు. రాత్రి అయినా బాలికలు ఇంటికి రాకపోవడంతో బాధిత తల్లిదండ్రులు కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నెల్లూరులో అనుమానాస్పదం..కర్నూలులో గుర్తింపు: బాలిక సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నెల్లూరులో ఉన్నారని గుర్తించిన పోలీసులు, బాలిక తల్లిదండ్రులతో కలిసి గురువారం నెల్లూరు చేరుకుని పలు ప్రాంతాల్లో గాలించారు. ప్రయోజనం లేకపోవడంతో నెల్లూరు పోలీసులను సహాయం కోరారు. మరో వైపు డీసీపల్లి టోల్ గేటు వద్ద మర్రిపాడు ఎస్సై విశ్వనాథ రెడ్డి తన సిబ్బందితో అనుమానాస్పదంగా వెళుతున్న ఓ లారీని తనిఖీ చేశారు. సురేష్ వద్ద బాలిక సెల్ ఫోన్ లభించగా అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తమ దైన శైలిలో విచారించగా బాలికలు కర్నూలులోని ఓ లాడ్జిలో ఉన్నారని చెప్పడంతో వెంటనే కర్నూలు పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలికలను సురక్షితంగా రక్షించడంతో పాటు మరో నిందితుడిని కూడా పట్టుకున్నారు. సురేష్‌ను కర్నూలు పోలీసులకు అప్పగించారు.
ఇది చదవండి