కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉప్పారహాలు గ్రామంలో విషాదం జరిగింది. గోడ కూలి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు… భీమన్న గౌడ్ అనే వ్యక్తి ఇల్లు ఓ వైపు కూలిపోయింది. దానిని మరమ్మతులు చేస్తుండగా ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన లక్మన్న, పెద్ద హరివణంకు చెందిన గంగమ్మ మరణించారు. మృతదేహాలను శవపరీక్ష కోసం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో మృతుల బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.
ఇదీ చదవండి: విషాదం: చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి