తుంగభద్ర పుష్కరఘాట్ల ఏర్పాట్లను వైకాపా నేత, అఖిల భారత గంగపుత్ర బెస్త మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షుడు అనిల్ కుమార్ బెస్త సందర్శించారు. ఈ నెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. నీటి ప్రవాహంపై పూర్తిగా అవగాహన ఉన్న గజ ఈతగాళ్లను వెంటబెట్టుకుని తీరంలో నీటి లోతును అంచనా వేశారు. పుష్కరాలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అనిల్ తెలిపారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం...
గజ ఈతగాళ్లైన బెస్తలపై ప్రభుత్వానికి అపార నమ్మకముందని నగర బెస్త సంఘం నేత గోవింద్ స్వామిబెస్త అన్నారు. అందుకే అధికారులు తమకు రక్షణ బాధ్యతలు అప్పగించారని వివరించారు. ప్రభుత్వం తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ పుష్కరాలను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: