కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటం వల్ల జల దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం - హైదరాబాద్ రహదారి ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయింది.
దారులన్నీ ఇరుకైనవి..
పర్యాటకులు వాహనాల్లో జలాశయం, శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. జలాశయ పరిసర రహదారులన్నీ ఇరుకైనవి కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వరుస క్రమంలో కాకుండా అడ్డదిడ్డంగా వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని పోలీసులు పేర్కొన్నారు. లింగాల గ్రామం వద్ద చేపల వ్యాపారాలు రహదారులపైనే కార్యకలాపాలు నిర్వహిస్తుండటం వల్ల ట్రాఫిక్ సమస్యకు మరో కారణంగా నిలిచింది.
ఇవీ చూడండి : కాలుష్యరహితంగా విశాఖను అభివృద్ధి చేస్తాం: విజయసాయి రెడ్డి