కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో రెండో రోజు కూడా టమాట ధరలు పతనమయ్యాయి. నిన్న ధర లేకపోవటంతో అన్నదాతలు టమాటను మార్కెట్లోనే పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు అదే పరిస్థితి నెలకొంది. కనీసం కోత కూలీలు, రవాణా ఛార్జీలు కూడా రాకపోవటంతో... తమ పంటను మార్కెట్లో పారబోసి వెళ్లిపోయారు. ఈ విషయం పై తెదేపా, సీపీఐ నాయకులు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం టమాటలు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ...
పడిపోయిన టమాటా ధరలు..కష్టానికి ప్రతిఫలం దక్కట్లేదని రైతుల ఆవేదన