కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జరిగిన దోపిడీల్లో ప్రధాన నిందితులైన మాచర్ల శ్రీకాంత్, గొల్ల అజయ్, నాగరాజును అరెస్టు చేసినట్లు శిక్షణ ఐపీఎస్ ప్రతాప్ శివ కిశోర్, డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. వారి నుంచి 30తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు ముగ్గురూ జులాయిగా తిరుగుతూ దొంగతనాలు చేసి, ఆ సొమ్ముతో జల్సాలు చేసేవారని వివరించారు.
ప్రధాన కాలనీల్లోని ప్రజలు ఎక్కడికైనా వెళ్లినపుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, గస్తీ ఏర్పాటు చేస్తామని అన్నారు. కాలనీల్లో నిఘానేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య కేసు: సీఐ, హెడ్ కానిస్టేబుల్కు బెయిల్